తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు రాష్ట్రంలో అమలు కాని పక్షంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసింది. ఆదేశాలు అమలు కానందుకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ను, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఇందుకు బాధ్యులుగా చేస్తామని హెచ్చరించింది. 
 
గతంలో ఆస్పత్రుల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని చెప్పామని... రాష్ట్రంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదని పేర్కొంది. అడ్వకేట్ జనరల్ సుప్రీంలో విచారణ జరగాల్సి ఉందని చెప్పగా అప్పటివరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని... పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం వల్లే వైద్యులకు కరోనా సోకిందని.... ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: