దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ వల్ల పాఠశాలలు, కాలేజీలు అన్నీ మూతబడ్డాయి. మరలా పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తాజాగా ఆగష్టులో పాఠశాలలు ఓపెన్ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరూ ఆగష్టులో పాఠశాలలు ఓపెన్ అవుతాయని భావించారు. 
 
అయితే టీఎస్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్కూల్స్ రీఓపెన్ గురించి స్పందించారు. రాష్ట్రంలో దసరా పండుగ వరకు పాఠశాలలు తెరిచే ప్రసక్తి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి మూడు నెలల తర్వాత స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో ఆలోచిస్తామని ఆయన అన్నారు. స్కూళ్లలో శానిటైజేషన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం వంటివి సులభం కాదని ఆయన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: