కొన్ని సందర్భాలు చాలా విచిత్రంగా కలిసి వస్తుంటాయి.. అయితే అది మంచికైనా చెడుకైనా ఉండొచ్చు.  అలా కొంత మందికి ఒకే నెలలో పుట్టడం.. అదే నెలలో కన్నుమూయడం జరుగుతుంది.  తాజాగా ఇలాంటిదే చెన్నైలో జరిగింది.  డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ కోవిడ్‌19తో మృతిచెందారు. చెన్నైలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.   అయితే నేడు ఆయన  62వ పుట్టిన రోజు.  పుట్టిన  రోజునే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతిచెందడం శోచనీయం. కరోనా వైరస్‌ వల్ల దేశంలో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. 

 

చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న డాక్టర్‌ రీలా ఇన్స్‌టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో ఆయన జూన్‌ 2వ తేదీన చేరారు. మంగళవారం రాత్రి ఆయన కండీషన్‌ మరింత ఆందోళనకరంగా మారింది. వెంటిలేషన్ ద్వారా అన్ని రకాలుగా ప్రయత్నాలు జరిపామని.. కానీ ఆయన ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయామని అన్నారు.  అయితే ఎమ్మెల్యే ప్రాణాలను కాపాడలేకపోయినట్లు ఇవాళ ఉదయం డాక్టర్లు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: