ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. రేపటి నుంచి గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. గ్రామాల్లో ఉన్నవాళ్లు పక్కనే ఉన్న ఇసుక రీచ్ ల నుంచి సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తెచ్చుకోవచ్చని చెప్పారు. 5 కిలోమీటర్ల పరిధిలోని ఇసుక రీచ్ ల నుంచి మాత్రమే తెచ్చుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదలవుతుందని అన్నారు. 
 
వర్షాలు ప్రారంభం అయ్యే లోపు 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలని అన్నారు. బల్క్ బుకింగ్ అనుమతులను జాయింట్ కలెక్టర్ చూసుకోవాలని అన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఇసుక ఉత్పత్తి పెంచాలని చెప్పారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: