టీ.ఆర్.ఎస్ మంత్రి కేటీఆర్ ఈరోజు సిరిసిల్లలో ప్రసంగిస్తూ సిరిసిల్ల జిల్లాలో కోనసీమ దృశ్యాలు కనిపిస్తున్నాయని అన్నారు తెలంగాణలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే భూగర్భ జలాలు భారీగా పెరిగాయని అన్నారు. గోదావరి గమనాన్ని మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని అనారు. ఇక్కడి అనుభవాలతో ఐ.ఏ.ఎస్ లకు శిక్షణ ఇస్తున్నారని అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని 665 చెరువులను గోదావరి నీటితో నింపుతున్నామని అన్నారు. 
 
భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారం అయిందని వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ చిత్తశుద్ధి వల్ల కరువు నేలపై నీళ్లొచ్చాయని అన్నారు. రాష్ట్రంలోని ఎర్రటి ఎండలోనూ చెరువులు నిండుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆరు మీటర్లు జలాలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో హరిత, నీలి, క్షీర విప్లవాలు రాబోతున్నాయని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: