సాధారణంగా అవిభక్త కవలలు జన్మించడం చూశాం.. రెండు తలలు అతుక్కొని పుట్టడం.. రెండు శరీర భాగాలతో కలిసి జన్మించడం ఎన్నో చూశాం. అయితే అప్పుడు మనుషుల్లోనే కాదు.. పశుపక్షాదుల్లో కూడా ఇలా జన్మిస్తుంటాయి. తాజాగా కృష్ణా జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ దూడ రెండు తలలతో జన్మించడంతో జనం ఆశ్చర్యపోతున్నారు.  ఆ ఆవుదూడను చూసేందుకు చుట్టుపక్కల వారు తరలివస్తున్నారు. అసలే కరోనా సమయం కావడంతో ఇలా వింతలు, విడ్డూరాలు చోటు చేసుకోవడంతో దీని గురించే స్థానికులు చర్చించుకుంటున్నారు. 

 

రెడ్డి గూడెం మండలం, రుద్రవరం గ్రామానికి చెందిన  గరికపాటి వెంకటేశ్వరావు ఇంటిలో ఓ గేదె ప్రసవించింది.  పశువైద్యాధికారులకు ఈ విషయం తెలియడంతో జన్యుపరమైన కారణాల వల్ల ఇలా జరిగి ఉంటుందని చెబుతున్నారు. రెండు తలలు ఉన్న ఆ దూడ ఎంత కాలం బతుకుంతుందనేది ఆసక్తిగా మారింది.  దానికి రెండు తలలు కూడా పని చేస్తుండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: