గాంధీ ఆస్పత్రిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం మాయమైంది. నిన్న ఆస్పత్రిలో మెహిదీపట్నంకు చెందిన రషీద్ అలీఖాన్ చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి మృతదేహం కోసం వచ్చిన బంధువులకు మృతదేహం కనిపించకపొవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. వైద్య సిబ్బంది ఈ విషయం గురించి స్పందించాల్సి ఉంది. 
 
కొన్ని రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో ఒక మృతదేహం బదులు మరో మృతదేహం తరలించటంతో వివాదం చెలరేగింది. తాజాగా మిస్సింగ్ అయిన మృతదేహం గురించి రోగి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది స్పందిస్తే మాత్రమే మృతదేహం మిస్సింగ్ గురించి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. మార్చురీలో ఉన్న శరీరం మిస్ కావడంతో మృతదేహం తారుమారు అయిందా...? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: