ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌‌, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా గేట్‌ వే హోటల్‌లో ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను హాల్‌టికెట్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఆధారంగా బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ (https://bie.ap.gov.in/)తో పాటు ఇతర వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. ఇక మార్కుల మెమోలు 15వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

 

కాగా ఫలితాలను తొలిసారిగా క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఫలితాల డేటా కావలసిన వెబ్‌సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ల నిర్వాహకులు వెబ్‌సైట్ పేరు, యూఆర్‌ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: