గత కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పలు చోట్ల దొంగ దెబ్బ తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది పుల్వామ దాడిలో అన్యాయంగా నలభై మంది జవాన్లు అమరులయ్యారు.  అయితే దానికి ప్రతి దాడిగా భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలు మట్టు పెట్టాయి.  ఇటీవల కాలంలో వరుసగా ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు.  తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కుల్గం జిల్లా నిపొరా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు తనిఖీలు నిర్వహించగా, గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.

 

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  ఇదిలా ఉంటే పుల్వామా జిల్లా త్రాల్ పరిధిలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.  కాగా, గత రెండు వారాల్లో 25 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.తనిఖీలు మరిన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: