గత 24 గంటల్లో రెండోసారి గుజరాత్ లో భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం క‌చ్ ప్రాంతంలో మ‌రోసారి భూ ప్ర‌కపంన‌లు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 : 57 గంటలకు కచ్‌ను భూకంపం తాకింది. దీంతో రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత నమోదైంది. గత 24 గంటల్లో కచ్‌ను తాకిన రెండో భూకంపం కావడంతో అధికారులు సైతం టెన్షన్ పడుతున్నారు. 
 
నిన్న రాత్రి గుజరాత్ లో భూకంపం సంభవించింది. రాజ్‌కోట్, కచ్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో నిన్న రాత్రి 8.13 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రాజ్‌కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై 5.8గా భూకంప తీవ్రత నమోదైంది. భూ ప్రకంపనల స‌మయంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: