రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నడుపుతున్న 230 స్పెషల్ ట్రైన్స్‌లో 3 రైళ్లు మినహా మిగిలిన వాటిలో జూన్, జులై నెలలకు బెర్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ టికెట్ బుక్ చేసుకునేవారికి ఖచ్చితంగా కన్ఫామేషన్ అవుతుందని చెప్పారు. పలు రూట్లలో అవసరాన్ని బట్టి రైళ్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు. 
 
రైల్వేస్టేషన్లలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని... ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని... భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో రైళ్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: