రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు 100కు అటూఇటుగా నమోదైన కేసులు ప్రస్తుతం 200కు పైగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటి కేంద్రంలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మున్సిపాలిటీ ఛైర్మ‌న్ రెడ్డి రాజు మార్కెట్ యజమానులకు పరీక్షలు నిర్వహించి మార్కెట్ ను మూసివేశారు. 
 
కూరగాయల వ్యాపారికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు అతనితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. రెండు వారాల క్రితం వ‌ర‌కు ఒక్క కేసు కూడా లేని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: