ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అసభ్యంగా దూషించాడని విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణి ఫిర్యాదు చేయగా నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. పూర్తి వివరాలలోకి వెళితే మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల ఛైర్మన్ గదిలోకి మార్చారు. 
 
దీంతో తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలంటూ రెండు రోజుల క్రితం అయ్యన్నపాత్రుడు పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని... హాల్ కు రంగులు వేయడం వల్ల మార్చటం కుదరదని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. ఫోటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేకు ఆమె తొత్తుగా మారారంటూ వ్యాఖ్యలు చేశారు. ఫోటో యథాస్థానంలో ఉంచకపోతే ‌ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని... మగవాడైతే వేరే విధంగా ట్రీట్‌మెంట్‌ ఉండేదని వ్యాఖ్యలు చేశారు. మనస్థాపానికి గురైన కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: