సాధారణంగా సముద్రజలాలు అపార మత్స్యరాశికి ఆవాసాలు. సముద్ర గర్భంలో మరింత లోతుకు వెళ్లేకొద్దీ భిన్న రకాల చేపలు భారీ సైజులో కనిపిస్తుంటాయి. కొన్ని సార్లు జాలర్లకు ఎన్నో అరుదైన చేపలు.. ఇతర నీటిలో నివసించే ప్రాణులు వలలో చిక్కుతుంటాయి.   తాజాగా మచిలీపట్నం వద్ద దిలకలదిండి పోర్టులో కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లగా వారి  పంట పండింది..  భారీ టేకు చేప చిక్కింది..3 టన్నుల బరువు గల టేకు చేపను ప్రోక్లైన్ ద్వారా ఒడ్డుకు చేర్చారు మత్య్సకారులు.. దీని విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని చెబుతున్న మత్య్యకారులు. 

వలలు తెగిపోతాయన్న కారణంతో ఈ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకొచ్చి, ఆపై క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. దీన్ని 'టేకు చేప' అంటారని మత్స్యకారులు తెలిపారు. ఇది వేలల్లో ధర పలుకుతుందని పేర్కొన్నారు. దాంతో వారంతా ఆనందంలో మునిగిపోయారు.. కొంత కాలంగా కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లకుండా ఉండాల్సి వచ్చిందని.. ఇదే సమయంలో తుఫాన్ల ఇబ్బందులు కూడా తమను ఎంతగానో ఇబ్బంది పెట్టాయని జాలర్లు తమ బాధ వ్యక్తపరిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: