దేశంలో ఫిబ్రవరి  నుంచి మొదలైన కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు తర్వాత ఢిల్లో కేసుల సంఖ్య పెరిగిపోతుంది.  ఢిల్లీలో ఇటీవల నిత్యం వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు.  తాజాగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆతిషి కరోనా బారినపడ్డారు. అస్వస్థతకు గురికావడంతో వైద్యపరీక్షలు చేయించుకున్న ఆతిషీకి కరోనా నిర్ధారణ అయింది.

 

ఆ మద్య సీఎం కేజ్రీవాల్ కి కరోనా పరీక్షలు చేయగా నెగిటీవ్ అని తేలింది.  తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ కరోనాపై వ్యతిరేక పోరాటంలో ఆతిషి ఎంతో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నామని సోషల్ మాద్యమంలో చేశారు. కాగా, ఆతిషిలో కరోనా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉండడంతో ఆమె ప్రస్తుతం తన నివాసంలోనే క్వారంటైన్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: