ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు మనం చైనాకి సంబంధించిన ఏదో ఒక వస్తువుపై ఆధారపడే ఉంటున్నాం.. చైనా మాయగాడు చేసిన మాయ అలాంటిది. ఏ కంపెనీ అయినా ఒరిజినల్ వస్తువు చేసిన క్షణాల్లో దాని డూప్లీకేట్ వస్తువులు తయారు అవుతుంటాయి. అంగట్లో చైనా మాల్ చాలా తక్కువ ధరకు లభిస్తుంటాయి.. దాంతో భారతీయులు ఎక్కువగా చైనా వస్తువులు కొనడం సర్వ సాధారణం అయ్యింది.  ఇప్పుడు చైనా మన సైనికుల్ని దొంగ దెబ్బ తీసింది.  అన్యాయంగా ఇరవై మంది సైనికుల్ని పొట్టనబెట్టుకుంది. దాంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి.

IHG

అంతే కాదు చైనా వస్తువులు, యాప్స్, ఫుడ్ అన్నీ బహిష్కరించాలని డిమాండ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చైనా ఫుడ్ ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. అంతే కాదు ప్రజలు చైనీస్ ఫుడ్, ఇతర వస్తువులు తక్షణమే బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కాగా, గతంలో రాందాస్ అథవాలే ‘గో కరోనా గో’ అంటూ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: