సోమవారం రాత్రి భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చైనాపై దేశంలో వ్యతిరేకత పెరుగుతోంది. 20 మంది భారత సైనికులు మృతి చెందటంతో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, చైనా యాప్ లను నిషేధించాలని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇండియన్ రైల్వే చైనాకు భారీ షాక్ ఇచ్చింది. చైనా సంస్థకు కేటాయించిన రూ.471 కోట్ల విలువైన ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 
 
ప్రాజెక్ట్ లో ఎలాంటి పురోగతి లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కాన్పూర్‌ - దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ సెక్షన్‌ మధ్య 417 కి.మీ. మేర టెలీ కమ్యూనికేషన్, సిగ్నలింగ్ ప్రాజెక్టు కొరకు భారతీయ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైనా సంస్థ ‘బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌ అండ్ డిజైన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్’ తో నాలుగేళ్ల క్రితం కుదుర్చుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: