టీటీడీ శ్రీవారి భక్తులకు వరుస శుభవార్తలు చెబుతోంది. నిన్న తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు 'నో హారన్' జోన్ గా ప్రకటిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. తిరుమలలో ఎవరూ కూడా హారన్ కొట్టకూడదని.. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. గోవింద నామ స్మరణ మాత్రమే తిరుమల కొండపై వినిపించాలని ఆయన చెప్పారు. ఇదే సమయంలో టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను పెంచుతూ భక్తులకు శుభవార్త చెప్పింది. 
 
ఆలయంలో మరింత మందికి దర్శనం కల్పించే వెసులుబాటు ఉండటంతో అదనపు కోటాను విడుదల చేస్తున్నట్లు టీటీడీ నుంచి ప్రకటన వెలువడింది. రోజుకు మూడు వేల టికెట్ల చొప్పున అదనపు కోటాను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: