ప్రపంచంలో ఎన్నో వింతలూ విశేషాల గురించి సోషల్ మీడియాలో చూస్తున్నాం.  ఒకప్పుడు పేపర్ లో వస్తే ఓహో ఇలా జరిగిందా అని తెలుసుకునేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని  ప్రపంచంలో జరిగి విచిత్రాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. తాజాగా సుమారు 50 నుంచి 80 లక్షల ఏండ్ల నాటి ఓ ఏనుగు శిలాజం బయటపడింది.  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహారన్‌పూర్‌లో బాద్షాహి బాగ్ పరిసరాల్లోని సివాలిక్ అవక్షేపాల్లో దీన్ని కనుగొన్నారు. అయితే  ఈ ఏనుగు శిలాజం వయసు సుమారు 50 నుంచి 80 లక్షల ఏండ్లు ఉంటుందని ఆయన చెప్పారు.

 

 కాగా, ధోక్ పఠాన్ రాతి శిలల్లో ఇది దీన్ని గుర్తించినట్లు సహారన్‌పూర్‌ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి వి.కె.జైన్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా ఇలాంటి అవశేశాలు ఆ కాలం నాటి జీవిరాశుల గురించి తెలుసుకోవొచ్చని అంటున్నారు పూరాతత్వ నిపుణులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: