ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాయలసీమ జిల్లాల్లో 22, 23 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని... మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. 
 
నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కాకినాడ, ముంచంగిపుట్టు, నాయుడుపేట, కందుకూరు, ఓర్వకల్లు, మంత్రాలయం, చింతలపూడి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉందని.... మిగిలిన జిల్లాల్లో సాధారణంగానే ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: