ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు నిర్వహించనుంది. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రాథమికంగా షెడ్యూల్ ను రూపొందించి తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈ తేదీలలో గ్రామ, వార్డ్ సచివాలయల పరీక్షలు జరుగుతాయి. 
 
గ్రామ, వార్డ్ సచివాలయాలలోని 16,208 ఉద్యోగాలకు 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వీలైనంత త్వరగా ఈ పరీక్షలను నిర్వహించాలని.... ఒక్కో గదిలో 16 లేదా 24 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆగష్టు నెలలో పరీక్షలు జరిగే అవకాశం ఉందని దరఖాస్తుదారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: