గత సోమవారం రాత్రి గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మృతి చెందారు. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ మోదీ, ఆయన అనుయాయులు ప్రజల భావోద్వాగాలను మానిప్యులేట్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాల్వాన్ ఘటనపై నాటకాలు, ఎమోషనల్ మానిప్యులేషన్ ఆపండి అంటూ ప్రధానిపై మండిపడ్డారు. 
 
ప్రధాని ప్రజలను మానసికంగా మోసం చేయవద్దని కోరారు. గాల్వన్ ఘటనపై ప్రశ్నలు అడిగితే దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని అన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటన గురించి ప్రధాని ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందక పలువురు రాజకీయవేత్తలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: