ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది.ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు  రూ.2.52 కోట్ల నిధులు పక్కదారి పట్టించినవారిపై క్రిమినల్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.  శ్రీఘ్రదర్శనం, అభిషేకం, మంగళహారతి టికెట్లలో గోల్ మాల్ జ‌రిగింది. దేవస్థానం గదుల బుకింగ్ లో కాంట్రాక్టు ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ మార్చి అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణ అయింది. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోసుగులను అడ్డం పెట్టుకుని బ్యాంకుల ద్వారా ఈ రెండు కౌంటర్లలో పనిచేసే ఉద్యోగులు విలువైన స్వామి వారి సొమ్మును స్వాహా చేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. 

 

ఒక్కో అవినీతి బండారం బయటపడుతుంటంతో ఈవోకి పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఉద్యోగులు. దీంతో మొత్తం కుంభకోణం వెలుగు చూసింది.  తాజాగా శ్రీశైలం ఆలయంలో రూ.2.52 కోట్ల స్కాం పై ఏసీబీ విచారణకు దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2016 నుంచి ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు, విరాళాలు, వసతి, అభిషేకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

 

దీనిపై స్పందించిన దేవాదాయశాఖ విచారణకు ఆదేశిస్తూ... మూడు నెలల్లో ఏసీబీ నివేదిక ఇవ్వాలని  ఉత్తర్వులు జారీ చేసింది.  భక్తులు ఎంతో నమ్మకంగా కొలిచే పుణ్య‌క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో ఇలాంటి అక్రమాలు జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: