చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.  ఎల్ఏసీ వద్ద పాక్ సైన్యం కాల్పులతో ఉద్రిక్తతలు నెలకున్న సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే లేహ్, కశ్మీర్‌లో నేడు పర్యటించనున్నారు. వాస్తవాధీన రేఖ దగ్గర క్షేత్రస్థాయి పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. చైనా, పాక్ సరిహద్దుల్లో సైన్యం సన్నద్ధత, మోహరింపు లాంటి అంశాల గురించి సమీక్ష జరిపి కీలక సూచనలు చేయనున్నారని తెలుస్తోంది. 
 
నిన్న ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో భద్రత గురించి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. జూన్ 22, 23న రెండు రోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న ఆర్మీ కమాండర్స్ రెండో దశ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఈ సమీక్షను జరిపారు. మరోవైపు  సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా  నిన్న భారత్, చైనా సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్స్ మధ్య చర్చలు జరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: