ఏపీ హైకోర్టులో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ గురించి విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై సీఎస్‌, శాసనసభ కార్యదర్శి కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. నాలుగు వారాలు సమయం ఇచ్చినా కౌంటర్లు దాఖలు చేయకపోతే ఎలా....? అని ప్రశ్నించింది. ప్రతివాదులందరికీ నోటీసులు అందాయో లేదో స్పష్టత ఇవ్వాలని.... పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 
 
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నిన్న విచారణ జరిగింది. శాసనసభ కార్యదర్శి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కౌంటర్ కు మరికొంత సమయం కావాలని చెప్పగా.... కోర్టు సీఎస్, శాసనసభ కార్యదర్శి కౌంటర్‌ దాఖలు చేయకపోవడాన్ని ఎలా భావించాలని ప్రశ్నించింది. మండలి రద్దు కోసం శాసనసభ చేసిన తీర్మానం ఎమ్మెల్సీల హక్కుల్ని కాలరాసేలా ఉందని దీపక్ రెడ్డి పిటిషన్ ను దాఖలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: