అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ గురించి ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరయ్యారు. అధికారులు సీజ్ చేసిన వాహనాల విషయంలో నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ సహాయ న్యాయవాదితో ఫైల్ చేయించడం సరికాదని.... న్యాయ సలహాదారుల పనితీరు బాగాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
సీజ్ చేసిన వాహనాలను మూడు రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ముందు ప్రవేశపెట్టాలని.... వాహనదారులు ఎక్సైజ్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మూడు రోజుల్లో సీజ్ చేసిన వాహనాలపై ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. డీజీపీ సవాంగ్ కోర్టు ముందు హాజరు కావడం ఇది మూడోసారి. 

మరింత సమాచారం తెలుసుకోండి: