దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. లాక్ డౌన్ వల్ల మూతబడిన ఆలయాలు 15 రోజుల క్రితం తెరచుకున్నాయి. లాక్ డౌన్  సడలింపుల వల్ల తిరుమల శ్రీవారి ఆలయం ఈ నెల 11 నుంచి భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే టీటీడీ 10వేల టికెట్లను భక్తుల కోసం అందుబాటులో ఉంచగా తాజాగా మరో మూడు వేల టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
మొదట 7వేల మందికి మాత్రమే టీటీడీ ఆలయ అధికారులు దర్శనభాగ్యం కల్పించారు. టీటీడీ అనంతరం మరో 3వేల మందికి దర్శనభాగ్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా మరో 3వేల ఆన్‌లైన్‌ టికెట్లు భక్తుల సౌకర్యార్ధం జారీ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. టీటీడీ భక్తులు టికెట్లను గ్రామ సచివాలయాల ద్వారా కూడా పొందే అవకాశం కల్పిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: