దేశంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందో తెలిసిందే.. అయితే దేశం అంతా ఒక ఎత్తైతే.. మహారాష్ట్ర లో మరో ఎత్తు.. ఇక్కడ విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి.  దేశంలో మూడో వంతు ఇక్కడే కేసులు ఉన్నాయి. ఈ మద్య లాక్ డౌన్ సడలింపు ఇస్తున్న విషయం తెలిసిందే.  అన్ని రాష్ర్టాలో సెలూన్స్ కు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ.. క‌రోనా విజృంభ‌ణ దృష్ట్యా మ‌హారాష్ర్ట‌లో అనుమ‌తివ్వ‌లేదు. సుమారు 3 నెల‌ల త‌ర్వాత అక్క‌డ సెలూన్స్ తెరుచుకుంటున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి హెయిర్ సెలూన్స్ దుకాణాల ఓపెన్ కు అనుమ‌తిచ్చారు.

 

కాకపోతే కండీషన్స్ తప్పకుండా పాటించాలని.. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. షాప్ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్విస్ట్ ఏంటేంటే.. కేవ‌లం హెయిర్ క‌టింగ్ కు మాత్ర‌మే అనుమ‌తిచ్చారు. షేవింగ్స్ కు అనుమ‌తివ్వ‌లేదు. దుకాణ య‌జ‌మాని, క‌స్ట‌మ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. లేని యెడ‌ల చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

 

ఇక దేశంలోనే మహారాష్ట్రలో అత్య‌ధికంగా 1,42,899 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 6,739 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్య‌ధికంగా ముంబైలో 69,528, థానేలో 27,880, పుణెలో 17,445, పాల్గ‌ర్ లో 4,028, ఔరంగాబాద్ లో 3867 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: