బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఆదరించిన స్థాయిలో మరే రియాలిటీ షోను ఆదరించలేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అతి త్వరలో నాలుగో సీజన్ ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే నాలుగో సీజన్ కు హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్నకు అక్కినేని సమంత పేరు వినిపిస్తోంది. సమంతను హోస్టుగా తీసుకోవాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సీజన్ 3కి అక్కినేని నాగార్జున అందుబాటులోకి లేకపోవడంతో కొన్ని ఎపిసోడ్స్‌కు రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఆ ఎపిసోడ్స్ ను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. దీంతో ఫిమేల్ హోస్ట్ అయితే బాగుంటుందని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది . త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి, ఇతరులు బిగ్ బాస్ సీజన్4 లో పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: