దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాకు క‌రోనా వ్యాప్తి, తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌లు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‌గత 10 రోజుల్లో 3,500 పడకలను వివిధ హోటళ్లలో ఏర్పాటు చేశామ‌ని.... రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఉందని తెలిపారు. 
 
 
ప్లాస్మా థెరపీ తర్వాత మరణాల శాతం దాదాపు సగం తగ్గింద‌ని..... ఆక్సిజన్ స్థాయి పడిపోతే మాత్రమే కరోనాతో చనిపోయే అవకాశం ఉందని అన్నారు. ఆక్సిజన్ లెవెల్స్ 90 నుంచి 85 శాతంకు పడిపోతే శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయని.... . ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 85 కంటే దిగువకు పడిపోతే అత్యంత ప్రమాదకర‌మ‌ని అన్నారు. ఎల్ఎన్‌జేపీ, రాజీవ్ గాంధీ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచబోతున్నామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 73,780 కేసులు నమోదు కాగా 2,429 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: