దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా కేసులు నమోదు అయ్యాయి.. మార్చి నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టారు. దాంతో రవాణా వ్యవస్థ మొత్తం స్థంభించిపోయింది.  ఈ నేపథ్యంలో రైళ్లు ఎక్కడిక్కడ ఆగిపోయాయి.  దేశంలో దశలవారీ లాక్‌డౌన్ ముగిసి అన్‌లాక్ ప్రక్రియ మొదలైందని ప్రధానమంత్రి మోడీ ఇటీవల జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో స్పష్టం చేసారు. అయితే కరోనా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది.. దాంతో  ప్రజా రవాణా తిరిగి పున: ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ ఆగష్టు 12 వరకు సాధారణ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

కాగా, కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వే శాఖ పలు స్పెషల్ ట్రైన్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఇక వీటి ఆక్యుపెన్సీపై దృష్టి సారించిన రైల్వేశాఖ త్వరలోనే డిమాండ్‌కు తగ్గట్టు వీటితో పాటుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కీలక ప్రకటన చేసింది. దాంతో ప్రతినిత్యం రైళ్లో ప్రయాణించే ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.  కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: