ఇప్పుడు దేశంలో కరోనాతో ప్రజాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలాదన్నట్లు ప్రకృతి సైతం పగబట్టినట్టు చేస్తుంది. వరుస తుఫాన్లతో సతమతమవుడున్నారు. దాంతో చిన్న చిన్న జీవరాశులు చనిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని కమలానగర్‌ ప్రాంతంలోని సరస్సులో శనివారం 31 తాబేళ్లు మృత్యువాత పడ్దాయి. శనివారం ఉదయం  ఓ వ్యక్తి కమలానగర్‌ సరస్సు వద్ద మార్నింగ్‌ వాక్‌  చేస్తుండగా..  తాబేళ్ల కళేబరాలను గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.  

 

వెంటనే అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని  మొత్తం 31 తాబేళ్లు మృత్యువాత పడినట్లు గుర్తించి వాటిని సరస్సు నుంచి బయటికి తీసినట్లు తెలిపారు.  ఈ రేంజ్‌ ఫారస్ట్‌ ఆఫీసర్‌ నిధి దేవి మాట్లాడుతూ మేము 31 ఫ్లాప్‌ షెల్‌ తాబేళు కళేబరాలను స్వాధీనం చేసుకున్నాం. అవి ఎలా చనిపోయాయనేది తెలియరాలేదు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించాం. అయితే ఇలా ఎందుకు జరిగిందో అన్న విషయం పై ఆరా తీస్తున్నారు.  రిపోర్టు వచ్చిన తరువాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: