క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మందిని బ‌లి తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఎంతో మంది విగ‌త జీవులు అవుతున్నారు. అయితే ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా 95 రోజుల పాటు క‌రోనాతో పోరాడి జ‌యించి బ‌తికాడు. బ్రిట‌న్‌కు చెందిన కీత్‌ వాట్సన్‌ మూడునెలలకు పైగా వైరస్‌తో పోరాడి మహమ్మారిని ఓడించాడు. 41 రోజులు ఐసీయూలో గడిపిన వాట్సన్‌ 23 రోజుల పాటు కోమాలో ఉన్నారు. ఓ దశలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో అత‌డిపై అంద‌రూ ఆశ‌లు వ‌దిలేసుకున్నారు.

 

చివ‌ర‌కు దీనిని అధిగ‌మించిన వాట్స‌న్ త‌న భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఇంటికి ప‌య‌న‌మ‌య్యారు. మూడు నెల‌ల పాటు అత‌డికి వైద్యం చేసిన సిబ్బంది అత‌డిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. అత‌డు ఇంటికి వెళ్ల‌గానే ఇంటివద్ద 100 మందికి పైగా స్నేహితులు, స్ధానికులు ఆయనను చప్పట్లతో స్వాగతించారు. దీర్ఘకాలం కరోనా మహమ్మారితో పోరాడి తాను ఇప్పటికీ సజీవంగా ఉన్న విషయం నమ్మలేకపోతున్నానని వాట్సన్‌ చెప్పుకొచ్చారు. వాట్స‌న్ విష‌యం ఇప్పుడు ప్ర‌పంచంలోనే సంచ‌ల‌నంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: