ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలైన చైనా, భారతదేశం మధ్య టిబెట్ ఎల్లప్పుడూ బఫర్ జోన్‌గా పనిచేస్తుంది.  భారత చైనా మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో... టిబెట్​​ సమస్య గురించి మాట్లాడాలని ప్రవాస టిబెటన్​ ప్రభుత్వ నాయకుడు లోబ్సాంగ్​ సంగే కోరారు. భారత్​-చైనాల మధ్య ఉద్రిక్తతలకు టిబెట్​ కూడా ఓ కారణమని... అందుకే టిబెట్​ను ప్రధాన సమస్యల్లో ఒకటిగా భావించాలని సంగే పేర్కొన్నారు.


తూర్పు లద్దాఖ్​ గల్వాన్ లోయ వద్ద భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ఇరుదేశాలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల్లో టిబెట్​ సమస్యను భారత్ లేవనెత్తాలని సంగే కోరుతున్నారు. ధర్మశాల టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాతో పాటు సిటిఎకు నివాసంగా ఉంది, దీనిని తరచుగా టిబెటన్ ప్రభుత్వం-బహిష్కరణ అని పిలుస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: