ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న గ్యాస్ లీక్ ఘటనలు ప్రజలను భయపెడుతున్నాయి. గ్యాస్ లీక్ ఘటనల దెబ్బకు  ఇప్పుడు ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది అనే చెప్పాలి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ప్రజల్లో భయం మొదలయింది. పరిశ్రమల దగ్గర ఉండే వారు కంగారు పడుతున్నారు. అదే విధంగా విశాఖలో అయితే కంపెనీలు వద్దు అని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజ్ సంఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌జలు అస‌లు ప‌రిశ్ర‌మ‌ల‌ను అడ‌వుల్లోనే పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

 

ఏదైనా చిన్న ప్ర‌మాదం జ‌రిగితే ప్రాణ న‌ష్టం ఉండ‌డంతో పలువురిలోనూ ఈ ప‌రిశ్ర‌మ‌ల వ‌ల్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తమకు ఒక్కొక్కరికి కోటీ రూపాయల్ బీమా చేయించాలి అని కూడా అడుగుతున్నారు. గత మూడు నెలల్లో మూడు గ్యాస్ లీక్ ప్రమాదాలు జరిగాయి. విశాఖ ఎల్జీ పాలీమర్స్, ఎస్పీవై రెడ్డి నంద్యాల, నేడు మరోసారి విశాఖ, ఇలా ఎక్కడో ఒక చోట గ్యాస్ లీక్ ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో ప్రజల్లో ఇప్పుడు కంపెనీలు అంటే చాలు భయం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: