దేశీయ టెలికాం దిగ్గజం జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తాజాగా కొత్త ప్లాన్లతో జియో కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) పేరుతో జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ లో భాగంగా జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. ఈ పరిమితి అయిపోయిన తరువాత నిమిషానికి ఆరు పైసల చొప్పున జియో చార్జీలను వసూలు చేస్తుంది. 
 
జియో 2599, 2399 ప్లాన్లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. 2599 రూపాయల ప్లాన్ కు టాక్ టైంతో పాటు రోజుకు 2 జీబీ డేటాతోపాటు 10 జీబీ డేటా బోనస్‌, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, డిస్నీ + హాట్‌స్టార్ సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తాయి. 2399 ప్లాన్ లో 10 జీబీ అదనపు డేటా లేదా డిస్నీ + హాట్‌స్టార్‌కు సభ్యత్వం మాత్రం లభించదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: