కరోనా లాక్ డౌన్ వల్ల లక్షల సంఖ్యలో భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ క్యారియర్ స్పైస్ జెట్ వారికి శుభవార్త చెప్పింది. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం మరిన్ని చార్టర్ విమానాలు నడపనున్నట్లు కీలక ప్రకటన చేసింది. స్పైస్ జెట్ యాజ‌మాన్యం ప్రైవ‌సీతో ప్రయాణించడానికి మొత్తం విమానాలను బుక్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తుల కోసం ఈ కొత్త స‌ర్వీసులు ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. 
 
ఈ విమానాలలో ఆరుగురు ప్రయాణికుల నుంచి 150 మంది ప్రయాణికుల వరకు ప్రయాణించే వేర్వేరు విమానాలు ఉంటాయని సమాచారం. ఇప్ప‌టికే 200 చార్ట‌ర్ విమాన స‌ర్వీసులు న‌డిపిస్తున్న స్పైస్ జెట్ ద్వారా 30,000 మంది ప్రయాణికులు భారత్ కు వచ్చినట్లు ఒక అంచనా. ప్ర‌ధానంగా గ‌ల్ఫ్ దేశాల నుంచి స్పైస్ జెట్ విమాన సర్వీసులను ఆపరేట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: