తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంఖ్య తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. కరోనా సోకిన 3 వేల మంది రోగుల వివరాలను ప్రైవేట్‌ ల్యాబ్‌లు ప్రభుత్వానికి ఇవ్వలేదని అధికారుల విచారణలో తేలింది. వీరికి సంబంధించిన 6వేల ప్రైమరీ కాంటాక్ట్ ల గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. 
 
3000కు పైగా పాజిటివ్‌ కేసుల గురించి ప్రైవేట్‌ ల్యాబ్‌లు వైద్య, ఆరోగ్య శాఖకు, ఐ.సీ.ఎం,ఆర్ కు నివేదించలేదు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు సరిగా తెలియకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. రిపోర్టులు ఇచ్చిన తర్వాత రోగుల వివారాలను ప్రభుత్వానికి తెలపకపోవడంతో కరోనా సోకిన వాళ్లు సామాన్య జనంలో కలిసిపోయారని తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: