ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో పేదలు ఆహారం కోసం పడుతున్న ఇబ్బందులు అందరికి తెలిసిందే. తినడానికి తిండి లేక ఎందరో అవస్థలు పడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆహారభద్రత, బియ్యం పంపిణీ చేపట్టనున్నట్లు  వెల్లడించింది. జులై నుంచి నవంబర్ వరకు పంపిణీ కొనసాగుతుందని తెలంగాణా సర్కార్ పేర్కొంది. కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు రాష్ట్రం మరో ఐదు కిలోలు అదనంగా  ఇవ్వనుంది అని తెలిపారు. 

 

రేషన్ పంపిణీ చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్రం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒక్కొక్కరికి నెలకు 10 కేజీల వరకు ఉచితంగా బియ్యం లేదా గోదుమలు రానున్నాయి. నేటి నుంచి పంపిణి మొదలు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: