తెలంగాణ‌లో క‌రోనా కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ప‌దిహేను రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుంద‌న్న ప్ర‌చారం జోరందుకుంది. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ 15 రోజుల పాటు లాక్ డౌన్ అంటే మ‌ద్యం అమ్మ‌కాలు ఉండ‌వ‌ని భావించిన మందు బాబుల ఈ ఐదు రోజుల్లో భారీ ఎత్తున మందు కొనేసి తాగేయ‌డ‌మో లేదా నిల్వ ఉంచుకోవ‌డ‌మో చేస్తున్నారు. జూన్‌ 26 నుంచి 30 మధ్య రాష్ట్రం అంత‌టా రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 

 

కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు బాసటగా నిలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు, జీఎస్‌టీ రాబడుల కంటే మద్యం విక్రయాలే ఎక్కువ ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరింది.  ఏదేమైనా లాక్ డౌన్ అన్న మాట‌తో తెలంగాణ మందుబాబులు ఐదు రోజుల్లో ఏకంగా 973 కోట్ల మందును కొనేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: