గత నెల 15న భారత్ చైనా దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా తీరుపై భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు నేడు టిబెట్‌ మత గురువు దలైలామా 85వ పుట్టినరోజు కావడంతో పలు దేశాల్లో పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో చైనా ఆందోళన పడుతోంది. చైనా గతంలో అనేక సందర్భాల్లో దలైలామాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. 
 
దలైలామా టిబెట్ స్వాతంత్య్రానికి సంబంధించి ఎటువంటి ప్ర‌క‌ట‌నైనా చేయ‌వ‌చ్చ‌ని చైనా టెన్షన్ పడుతోంది. దలైలామాను వ్యతిరేకిస్తూ చైనా ఏదో ఒక‌టి చేస్తుంద‌నే ప్రచారం జరుగుతోంది. ప్రపంచానికి శాంతి, మానవత్వ సందేశాన్ని ఇచ్చే మత గురువుగా గుర్తింపు పొందిన దలైలామా ఏం చేస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: