క‌రోనా విజృంభణ వల్ల వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు తగ్గిపోవడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎన్నో రంగాల్లో ఎన్నో ల‌క్ష‌ల మందిని ఈ క‌రోనా నిరుద్యోగుల‌ను చేసింది. ఇంకా చెప్పాలంటే క‌రోనా దెబ్బ‌తో ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల్లో ఉపాధి అవ‌కాశాలు ఘోరంగా దెబ్బ‌తిన్నాయి. వ్య‌వ‌సాయం, ఇత‌ర ఉపాధితో ఇప్పుడు ప‌ల్లె ప్రాంతాల్లోనే ప‌రిస్థితులు బాగున్నాయంటున్నారు. ఇదే విషయాన్ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ(సీఎంఐఈ) తెలిపింది. 

 

ఈ ఏడాది ఏప్రిల్‌లో 17.7 మిలియ‌న్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ఇక కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ స‌డ‌లింపుల‌తో సంస్థ‌లు తెరచుకున్నా 3.9 మిలియ‌న్ల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరారని చెప్పింది. కరోనా విజృంభణ వల్ల విధించిన లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పటికీ‌ ప‌ట్ట‌ణాల్లో నిరుద్యోగుల సంఖ్య‌ 11.26 శాతానికి పెరిగిందని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: