దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు. ఇక ఢిల్లీలో కరోనా కేసులు లక్ష దాటాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

 

అయితే అదే స్థాయిలో రికవరీ కూడా అవతున్నారని అన్నారు. తాజాగా దేశవ్యాప్తంగా పలు జోన్లలో పనిచేస్తున్న  రైల్వే ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారు. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులు,  వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు  కరోనా వైరస్ సోకింది. ఈ కరోనా వైరస్  ప్రభావంతో ఇప్పటి వరకు 86 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. 

 

కరోనా తో ఇబ్బంది పడుతున్న బాధితులును   ఏప్రిల్‌లో హాస్పిటల్‌ను ప్రత్యేకంగా కేటాయించారు.  అత్యధికంగా సెంట్రల్‌ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్‌ రైల్వే నుంచి 313 మందికి కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది. చనిపోయిన 86 మందిలో   22 మంది  రైల్వే ఉద్యోగులు కాగా, మిగిలిన వారిలో వారి కుటుంబసభ్యులు, రిటైర్డ్‌ సిబ్బంది ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: