భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ విజృంభణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 

శాస్త్రవేత్తలు ప్రస్తుతం నమోదవుతున్న కేసులతో పోలిస్తే భవిష్యత్తులో 12 రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతాయని చెబుతున్నారు. మరణాల సంఖ్య కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2021 మార్చి నాటికి 25 కోట్ల మంది వైరస్ భారీన పడే అవకాశం ఉందని... 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: