ప్రపంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా విజృంభిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు మొత్తం 1..22 కోట్ల‌కు చేరుకున్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 5.50 ల‌క్ష‌ల‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్నాయి. ఇక 70 ల‌క్ష‌ల మంది ఈ కేసుల నుంచి రిక‌వ‌రీ అయ్యారు. ఇక ఒక్క అమెరికాలోనే ఇప్ప‌టివ‌ర‌కు 1.34 ల‌క్ష‌ల మంది క‌రోనా తో మృతి చెందారు. క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తున్న దీని వ్యాప్తి విష‌యంలో మాత్రం వైవిధ్య‌త క‌నిపిస్తోంది. క‌రోనా ముందు యూర‌ప్‌, ఆఫ్రికా దేశాల‌ను గ‌డ‌గ‌డ లాడించేసింది.

 

అయితే ఇప్పుడు క్ర‌మేణా క‌రోనా యూర‌ప్‌, ఆఫ్రికా దేశాల్లో త‌గ్గుముఖం ప‌డుతోంది. ఈ రెండు ఖండాల్లో ఈ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుండ‌గా... అమెరికా, ఆసియా దేశాల్లో మాత్రం క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నాటికి యూర‌ప్‌, ఆఫ్రికా కంటే ఆసియా, అమెరికా ఖండాల్లో క‌రోనా సృష్టించే విధ్వంసాన్ని ఊహించ లేక‌పోతున్నామ‌ని కూడా ప‌లువురు అంత‌ర్జాతీయ నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: