ప్రపంచవ్యాప్తంగా 12,164,119 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 5,52,023 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5.5 మిలియన్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా మహమ్మారి అతి కొద్ది కాలంలోనే ప్రపంచం మొత్తం చుట్టేసింది. కరోనా వైరస్ ని అరికట్టడానికి ఇప్పటి వరకు మందు కనిపెట్టలేదు. తాజాగా ఇండోనేషియాలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  ఇటీవల కాలంలో ఇక్కడ భారీ స్థాయిలో భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే. పెద్దగా ప్రాణ నష్టం కాకున్న ఆస్తి నష్టం బాగానే అయింది. ఇప్పుడు కరోనా కేసులు కూడా బాగానే పెరిగిపోతున్నాయి.

 

పశ్చిమ జావాలోని మిలటరీ అకాడమీ కాంపౌండ్, పారిశ్రామిక ప్రాంతంలో వైరస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూశాయి. గత 24 గంటల్లో దేశంలో 2,657 కేసులు నమోదయ్యాయి.  ఈ నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 70,736కు పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, కొత్తగా 58 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,414కు పెరిగింది. ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం ఇండోనేషియానే.  

మరింత సమాచారం తెలుసుకోండి: