దేశంలో కరోనా రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉంది. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 26,506 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఈ నేపథ్యంలో రేపు రాత్రి 10 గంటల నుంచి జూలై 13వ తేదీ ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.  గత కొన్ని రోజులుగా యూపిలో కరోనా కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ కొత్తగా 1,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

యూపీలో మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. యూపీలో గత 24 గంటల్లో 18 మంది కరోనా వల్ల మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 30వేల మార్క్‌ను దాటాయి. యూపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,156కి చేరినట్లు ఆ రాష్ట్ర హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: