ప్రపంచంలో కరోనా మహమ్మారితో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,23,78,854  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,56,601 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 2,22,825 కరోనా కేసులు రికార్డయ్యాయి. అయితే కరోనాతో ఎక్కువగా  వృద్దులు.. ప్రాణాంతకరమైన వ్యాధులు ఉన్నవారు వెంటనే మరణిస్తున్నారని అంటున్నారు. తాజాగా సౌదీ అరేబీయాలోని తైఫ్‌లో కరోనా వైరస్ బారి నుంచి ఓ శతాబ్ధికురాలు కోలుకుంది.  ఇటీవల కాలంలో వందేళ్లకు పైబడిన వారు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.

 

తాజాగా  106 ఏళ్ల మహిళ తన కుమారులు, కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి కింగ్ ఫైసల్ మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స పొందారు. తైఫ్‌కు దక్షిణంగా ఉన్న చారిత్రాత్మక గ్రామమైన బని సాద్‌కు చెందిన జెడారా తెగకు చెందిన ఈ వృద్ధురాలికి కరోనా పాజిటీవ్ అని తేలింది. వెంటనే ఆమె 21 రోజులు పాటు అక్కడి మెడికల్ కాంప్లెక్స్‌ లో చికిత్స అందించారు.

 

ఆ తర్వాత పరీక్షలు చేయగా.. నెగిటివ్‌గా తేలడంతో ఆమెను డిశ్చార్జి చేశారు.  ఆమెతో పాటు ఆమె 70 ఏండ్ల కుమారుడు, 60 ఏండ్ల కుమార్తె కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు.  తైఫ్ కమిషనరేట్‌లో కరోనా నుంచి కోలుకున్న మొదటి 106 ఏండ్ల వృద్ధురాలిగా ఈమె నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: