చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకు వచ్చిన మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,26,25,000 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 5,62,820 మంది ప్రాణాలు కోల్పోగా, కోలుకున్న వారి సంఖ్య 73,61,659 ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక భారత దేశంలో ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ వస్తున్నాయి. 

 

తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,13,07,002 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,82,511 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

 

ఇక  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,20,916కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,123కి పెరిగింది. 2,83,407 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: