రాజ‌స్థాన్ రాజ‌కీయాలు నిమిషం నిమిషానికి మారుతున్నాయి. ఇక రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్ పైలెట్ అధిష్టానంపై అస‌మ్మ‌తి బావుటా ఎగుర వేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. స‌చిన్‌ను ప్ర‌శ్నించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ ఏకీంగా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ఆయ‌న వ‌ర్గం మండి ప‌డుతోంది. దీనిపై కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం సైతం తీవ్రంగా విస్మ‌యం వ్య‌క్తం చేసింది. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తికి ఎలా నోటీసులు జారీ చేస్తార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

ఇక త‌న‌కు 19 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని చెపుతోన్న స‌చిన్‌కు బీజేపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కుప్ప కూల్చ‌డ‌మే టార్గెట్‌గా కాచుకుని ఉన్న బీజేపీ ఈ ప‌రిణామాలు త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాట‌డంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. సచిన్‌ పైలట్‌కు నచ్చచెప్పేందుకు చివరినిమిషం వరకూ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: